
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ పంచ్ఈవీ, నెక్సాన్ఈవీలు కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్- ఎన్సీఏపీ) క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించాయి. టెస్టులో 32 పాయింట్లకు గాను 31.46 పాయింట్లను సంపాదించాయి. అడల్ట్ఆక్యుపెంట్విభాగంతో 49 పాయింట్లకు 45 పాయింట్లు వచ్చాయి. టాటా పంచ్ ఈవీ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.71 పాయింట్లు, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.74 పాయింట్లను స్కోర్ చేసింది.