
ఎమ్మె ల్సీ ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టులాంటి తీర్పు వచ్చిందని, ఇవే ఫలితాలు లోక్ సభ ఎన్ని కల్లోనూ పునరావృతం అవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కారు పంక్చర్ ఇప్పటికే మొదలైందని, గాలి పోతోందని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ సిట్టిం గ్ ఎమ్మెల్సీలు ఇద్దరు ఓడిపోయారని, విద్యావంతులు , ఉద్యోగస్తులు ఇచ్చిన తీర్పుతో సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల కళ్లు బైర్లు కమ్మాయని అన్నారు. తండ్రి, కొడుకులకు మోడీ ఫోబియా పట్టుకుందని,నిద్రలో కూడా మోడీని కలవరిస్తున్నారు. కేసీఆర్ శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం అని, ‘16 సీట్లు గెలుస్తాం, దేశాన్ని శాసిస్తాం’ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లోక్‌సభకే పోటీ చేయడం లేదు, ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. కేంద్రం లో చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరని, ఇండియా గేట్ దగ్గర గడ్డి కూడా పీకలేరని, ఇప్పుడు 15 మంది ఎంపీలు ఉంటే ఏంచేశారని ప్రశ్నిం చారు. కేసీఆర్, కేటీఆర్‌లు నాం దార్లు, జమీన్ దార్లు మాత్రమే నని, ప్రధాని మోడీ చౌకీదార్, కామ్‌దార్ అని చెప్పారు. అజ్మీర్‌లో చాదర్ కప్పడానికి కేసీఆర్ వెళ్తారని, కానీ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లకుండా మనవడిని పంపిస్తారని విమర్శించారు. కేసీఆర్ కంటే ఎక్కువగా రావణాసురుడు యజ్ఞయాగాదులు చేశారన్నారు.
నీటి బుడగ ఎప్పుడు పేలుతుందో…
బీజేపీ పోటీనే కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారు. నిజమే మీకు మీరే పోటీ. కేటీఆర్‌తో పోటీ.రెండు నెలల తర్వాత అంతా బయట పడుతుంది. నీటి బుడగ ఎప్పుడు పేలుతుందోనని అన్నారు.
ఏప్రిల్ 4న అమిత్ షా సభలు….
ఈనెల 29న మహబూబ్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని, ఏప్రిల్ 1న హైదరాబాద్ లో జరిగే సభలోనూ పాల్గొంటారని చెప్పారు. ఏప్రిల్ 4న రెం డు చోట్ల అమిత్ షా బహిరంగ సభలు ఉంటా యని, 6న నల్లగొండ, హైదరాబాద్‌లో రోడ్ షోలు ఉంటాయని తెలిపారు.