Pune bus rape case: పుణె బస్సులో అత్యాచారం కేసు..నిందితుడు దొరికాడు

Pune bus rape case: పుణె బస్సులో అత్యాచారం కేసు..నిందితుడు దొరికాడు

పుణెలోని స్వర్గేట్ బస్స్ స్టేషన్ లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 28) తెల్లవారుజామున ఫుణే జిల్లాల్లోని షిరూర్ తహసీల్ లో నిందితుడు దత్తాత్రేయ గాడెను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుకోసం వేచి ఉన్న బాధితురాలిని ప్రలోభ పెట్టి MSRTC బస్సులో దారుణా నికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది. 

నిందితుడిని పట్టిస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడికోసం బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందితుడు దత్తత్రేయను  పుణె క్రైం బ్రాంచి పోలీసులు అరెస్ట్ చేశారు.