ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి

ముంబై: ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని చాలా మంది సంబరపడిపోతారు. ఈ ఫ్యామిలీ కూడా ఆ కోవలోకే వస్తుంది. తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత అమ్మాయి పుట్టిందని మురిసిపోయింది. మహారాష్ట్ర పుణెలోని షెల్గావ్ లో అప్పుడే పుట్టిన ఆడపిల్లను హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత పాపకు పూల మాలలు వేసి స్వాగతం పలికారు. ఆ తర్వాత సొంతకారులో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. 

ఈ వేడుకను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. ఈ విషయంపై చిన్నారి తండ్రి విశాల్ జరేకర్ స్పందిస్తూ.. తమ కుటుంబంలో ఆడపిల్లలు లేరని, అందుకే చిన్నారి హోమ్ కమింగ్ ను గ్రాండ్  గా సెలబ్రేట్ చేశామన్నారు. లక్ష రూపాయలతో చాపర్ రైడ్ ను అరేంజ్ చేశామని.. చిన్నారికి రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టామని చెప్పారు. జెజురీలోని ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భావించామని.. అయితే అందుకు అనుమతి లేకపోవడంతో ఆకాశం నుంచే దండం పెట్టుకున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

షాంఘైలో లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ దురుసు ప్రవర్తన

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే