Madhavi Kumbhar: హ్యాండిల్ పట్టుకోకుండా..యువతి రిస్కీ బైక్ స్టంట్..వీడియో వైరల్

Madhavi Kumbhar: హ్యాండిల్ పట్టుకోకుండా..యువతి రిస్కీ  బైక్ స్టంట్..వీడియో వైరల్

బైక్ స్టంట్స్ సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం.. అవికూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తుంటారు.. కానీ ఇటీవల సాధారణ వ్యక్తులు కూడా బైక్ స్టంట్ లు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కేవలం రీల్స్ చేయడం కోసమే బైక్ లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు యూత్. ఫుణెలో ఓ అమ్మాయి బైక్ పై స్టంట్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ అమ్మాయి బైక్ స్టంట్స్ ఎలా చేసింది..ఎందుకు చేసిందో తెలుసుకుందాం.. 

మహారాష్ట్రలోని పుణెలో ఓ యువతి బైక్ పై కూర్చోని హ్యాండిల్ పట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..  మాధవి కుంభర్ అనే ఈ యువతి బైక్ పై చేతులు వదిలి బైక్ ను నడుపుతున్న దృశ్యాలు మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే  కేవలం రీల్స్ కోసమే మాధవి ఈ ప్రమాదక రమైన స్టంట్స్ చేస్తుంది. 

మాధవి కుంభర్ ఫేమస్ యూట్యూబర్.. ఆమె వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎదురు చూస్తుంటారు.. దాదాపు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే..నెటిజన్లను ఎంతలా ఇన్ ఫ్లుయెన్స్ చేశారో తెలుస్తుంది. ఈ క్రమంలో మాధవి మరింత ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉత్సాహంతో బైక్ స్టంట్స్ చేసింది.. 

మాధవి రోడువైపు చూడకుండా బైక్ పై ఒకపక్క కూర్చొని రైడ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.  ప్రయాణ సమయంలో ఒక పెవిలియన్ రైడర్ ఎలా కూర్చుంటాడో అలా ఆమె బైక్ పై కూర్చుంది. అంతేకాదు రైడింగ్ సమయంలో డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోలో ఇన్ స్టా గ్రామ్ బాగా వైరల్ అవుతోంది. 

అయితే మాధవి బైక్ స్టంట్స్ పై నెటిజన్లు కొందరు ఆమెను సపోర్టు చేస్తే..మరికొందరు విమర్శించారు.. ఫేమస్ కావడంకోసం ప్రాణాలను పణంగా పెట్ట డం సరికాదు.. యూట్యూబర్లు ఇలాంటివి మానుకుంటే మంచిది అని సలహాలు ఇస్తున్నారు. 

ఇంకొందరు ఆమెకు బైక్ స్టంట్స్ చేయగల కెపాసిటీ ఉంది గనక చేస్తుంది.. తన టాలెంట్ చూపిస్తే తప్పేముందు అంటున్నారు. ఏదీ ఏమైనా జనాలు ఉండే రోడ్లపై ఇలాంటి స్టంట్స్ చేసిన ఇతరులకు ఇబ్బంది కలిగించే పని చేయొద్దంటున్నారు ఇంకొందరు నెటిజన్లు.. 

ఫుణెలో ఓ అమ్మాయి బైక్ పై స్టంట్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ అమ్మాయి బైక్ స్టంట్స్ ఎలా చేసింది..ఎందుకు చేసిందో తెలుసుకుందాం..