కారుతో తొక్కించి ఇద్దర్ని చంపి : రోడ్డు సేఫ్టీపై వ్యాసం రాశాడు

కారుతో తొక్కించి ఇద్దర్ని చంపి : రోడ్డు సేఫ్టీపై వ్యాసం రాశాడు

దాదాపు నలభై రోజుల క్రితం పూణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడి కేసు దేశవ్యాప్త సంచలనంగా సృష్టించింది. పూణేలో 17ఏళ్ల బాలుడు మద్యం సేవించి ఓ లగ్జరీ కారు వేగంగా నడిపి ఇద్దరు టెక్కీల చావుకు కారణమైయ్యాడు. ఈ కేసులో చాలా ట్విస్టులు బటయ పడ్డాయి. బాలుడిని శిక్ష నుంచి తప్పించడానికి అతని కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి కుటుంబం మొత్తం జైలు పాలైయ్యారు. 

మే 19న రోడ్డు యాక్సిడెంట్ జరగగా..  జువెనైల్ జస్టిస్ బోర్డ్ మైనర్ బాలుడిని మే 22న అబ్జర్వేషన్‌ హోమ్‌కు పంపింది. జువైనల్ కోర్టు 17ఏళ్ల మైనర్ బాలుడికి రోడ్డు భద్రతపై 300 పదాల్లో వ్యాసం రాయాలనే షరతుతో అరెస్టై రెండు రోజులకే బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ విషయంపై ఆందోళనలు జరిగాయి. బెయిల్ షరతులకు అనుగుణంగా రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసాన్ని జువెనైల్ జస్టిస్ బోర్డ్ కు  సమర్పించినట్లు అధికారి శుక్రవారం తెలిపారు. 

బాలుడిని నేరం నుంచి తప్పించాలని తప్పుడి ఆధారాలు క్రియేట్ చేశారు. అందుకు అతని తండ్రి బిల్డర్ విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్, తల్లి కూడా జైలు పాలైయ్యారు.