రైతులను గన్తో బెదిరించిన.. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్ట్

రైతులను గన్తో బెదిరించిన.. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్ట్

ముంబై: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్  పూజా ఖేడ్కర్ తల్లిని పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ( జూలై 18) మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మనోరమ.. రైతులను పిస్టల్ తో బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో గత కొద్ది రోజులుగా సోష ల్ మీడియాలో వైరల్ అయింది. విషయం పోలీసులకు తెలవడంతో గురువారం ఉదయం మనోరమను రాయ్ గఢ్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.  

Also Read :- నీట్ పేపర్ లీక్ కేసులో కీలక అప్డేట్

మరోవైపు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ వివాదం కొనసాగుతుండగానే ఆమె తండ్రి అవినీతికి సంబంధించిన వార్తలు బయటికి వచ్చాయి.  పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. సర్వీస్ లో ఉన్నప్పుడు రెండుసార్లు అవినీతికి పాల్పడి సస్పెండ్ అయ్యారు. అటు తల్లి, ఇటు తండ్రిపై ఉన్న అలిగేషన్స్ తో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పూజా ఖేడ్కర్ ను ఐఏఎస్ ట్రైనింగ్ నుంచి తొలగించారు.