యూఎస్ బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌పై గెలిచిన ఇండియన్ బర్గర్ కింగ్‌‌‌‌

యూఎస్ బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌పై గెలిచిన ఇండియన్ బర్గర్ కింగ్‌‌‌‌

న్యూఢిల్లీ: అతిపెద్ద యూఎస్ కంపెనీల్లో ఒకటైన బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌తో 13 ఏళ్ల పాటు పోరాడి గెలిచింది.. ఇండియాకు చెందిన ఓ చిన్న రెస్టారెంట్. బర్గర్ కింగ్ కార్పొరేషన్  1954 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇండియాలోకి ఎంటర్ అయ్యింది మాత్రం 2011లోనే. అప్పటికి పూణెలోని ఓ ఇరాని దంపతులు బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్ పేరుతో  ఓ చిన్న రెస్టారెంట్‌‌‌‌ను నిర్వహిస్తున్నారు. వీరు ట్రేడ్‌‌‌‌మార్క్‌‌‌‌ నిబంధనలను ఉల్లంఘించారని, తమ పేరు వాడకుండా ఆపాలని, కాంపెన్సేషన్ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పూణె కోర్టుని బర్గర్ కింగ్ కార్పొరేషన్‌‌  కోరింది. 

ఈ ఇరాని కపుల్స్ మాత్రం తాము 1992 నుంచి బర్గర్ కింగ్ పేరును వాడుతున్నామని, అప్పటికి బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్ కార్పొరేషన్ ఇండియాలోకి ఎంటర్ కాలేదని వాదించారు. తాము ఎవరినీ తప్పుదోవ పట్టించాలని అనుకోలేదని, ఏ బ్రాండ్‌‌‌‌ను కాపీ చేయాలని చూడలేదని పేర్కొన్నారు. తమ బర్గర్ జాయింట్ పెట్టే టైమ్‌‌‌‌కి యూఎస్‌‌‌‌ బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌ గురించి ఇండియాలో ఎవరికీ తెలియదని అన్నారు.  బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్ కార్పొరేషన్ తీసుకున్న చర్యలు తమ బిజినెస్‌‌‌‌ను నష్టపరిచాయని చెప్పిన ఇరాని కపుల్స్‌‌‌‌, రూ.20 లక్షల కాంపెన్సేషన్‌‌‌‌ను డిమాండ్  చేశారు. తమ బిజినెస్‌‌‌‌లకు డ్యామేజ్ జరిగిందని నిరూపించే సాక్ష్యాలను  ఇరు వర్గాలు ప్రవేశ పెట్టకపోవడంతో కాంపెన్సేషన్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను  పూణె కోర్టు కొట్టిపారేసింది. అలానే  బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌ పేరును చిన్న రెస్టారెంట్ వాడకుండా చేసేందుకు బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్ కార్పొరేషన్ చేసిన రిక్వెస్ట్‌‌‌‌ను  కొట్టిపారేసింది. దీంతో 13 ఏళ్ల  లీగల్ గొడవకు తెరపడింది. కోర్టు తీర్పుతో  ఇరాని కపుల్స్ తమ బర్గర్ జాయింట్‌‌‌‌ను బర్గర్ కింగ్ పేరుతో నడుపుకోవచ్చు.