
పాపం అభం శుభం తెలియని చిన్నారి..మూడేళ్లు కూడా నిండని పసిహృదయం ఎంత తల్లడిల్లిందో..పెంచిన చేతులే హతమార్చాయి. క్షణికావేశం పేగుబంధాన్ని కూడా గొంతుకోసి తెంచేసింది.ఫూణెలో భార్యపై అనుమానంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన కొడుకును హతమార్చిన ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణెలోని చందన్ నగర్లో రతన్ ప్రెస్టీజ్ అపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. రతన్ ప్రెస్టీజ్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న మాధవ్ సాధురావు టికేటీ తన కొడుకు హిమ్మత్ ను హత్య చేశాడని పోలీసులు శనివారం(మార్చి22) అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా మాధవ్, అతని భార్యతో మనస్పర్థల కారణంగా గొడవలు పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మాధవ్.. హిమ్మత్ ను బయటికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపి సమీప అడవుల్లో పడేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
మాధవ్ గత కొంతకాలంగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం భార్యతో గొడవపడిన మాధవ్..కొడుకును తీసుకొని ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని పోలీసులు తెలిపారు. మాధవ్ కనిపించడం లేదంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ALSO READ | ప్రియుడితో భర్తను చంపి.. డెడ్ బాడీని దర్జాగా బైక్ పై అడవికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మాధవ్ టికేజీ తన కొడుకుతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లి తర్వాత ఓ షాపులో కత్తి, బ్లేడ్ కొనుగోలు చేసి.. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపి , మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హత్య అనంతరం ఓ హోటల్ లో ఉన్న మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో మాధవం బాగా తాగి ఉన్నట్లు గుర్తించారు.మాధవ్ టికేజీపై భారత న్యాయ సంహిత (బీఎన్ ఎస్ ) సెక్షన్ 103(1) , 238 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.