అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం

అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం

ఢిల్లీ: డిసెంబర్ 31, 2024న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 40 ఏళ్ల వయసున్న ఒక వ్యాపారవేత్త తన ఇంట్లోని బెడ్రూంలో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య తీరుతో విసిగిపోయి.. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఫేమస్ కేఫ్ కో ఫౌండర్ పునీత్ ఖురానా అనే వ్యక్తి ఢిల్లీలోని కల్యాణ్ విహార్ ప్రాంతంలో ఉన్న మోడల్ టౌన్లో నివాసం ఉంటున్నాడు.

ఖురానా అతని భార్య మనీకా జగ్దీష్ పహ్వా కాపురంలో విభేదాలు తలెత్తడంతో విడాకుల తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఢిల్లీలో వుడ్ బాక్స్ కేఫ్ స్టార్ట్ చేశారు. విడాకుల కారణంగా ఈ వ్యాపారం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఖురానా ఫ్యామిలీ తెలిపిన డీటైల్స్ ప్రకారం.. అతని భార్య విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత కూడా వేధింపులకు గురిచేసింది. ఇద్దరూ కలిసి చేసిన బిజినెస్ ఎవరికి చెందాలనే విషయంలో అతనికి నరకం చూపించింది. సూటిపోటి మాటలతో వేధించింది. ఈ కారణంగానే భార్య వేధింపులు తట్టుకోలేక ఖురానా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అతని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ALSO READ | యూపీలో తండ్రి సహకారంతో యువకుడి కిరాతకం.. తల్లినీ, నలుగురు అక్కా చెల్లెళ్లను క్రూరంగా చంపేసిన యువకుడు..

పునీత్ ఖురానాకు, మనీకా జగ్దీష్ పహ్వాకు 2016లో వివాహమైంది. ఖురానాకు, అతని భార్య మనీకాకు మధ్య జరిగిన 16 నిమిషాల సంభాషణకు సంబంధించిన ఆడియో బయటికొచ్చింది. బిజినెస్ ప్రాపర్టీ గురించి అతనితో మనీకా వాగ్వాదానికి దిగినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. ‘‘మనం విడాకులు తీసుకుంటున్నాం. కానీ ఇప్పటికీ నేను నీ బిజినెస్ పార్ట్నర్.. నాకు రావాల్సిన డబ్బును నువ్వు చెల్లించాల్సిందే’’ అని ఖురానాతో అతని భార్య కరాఖండిగా చెప్పినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. భార్య వేధింపుల కారణంగా 24 పేజీల సూసైడ్ నోట్ రాసి అతుల్ సుభాష్  అనే బెంగళూరు టెకీ చనిపోయిన రోజుల వ్యవధిలోనే భార్య వేధింపులతో మరో వ్యక్తి చనిపోవడం శోచనీయం. ఖురానా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.