వదంతులను నమ్మొద్దు.. కఠినంగా శిక్షిస్తం: ఎస్పీ సింధు శర్మ

వదంతులను నమ్మొద్దు.. కఠినంగా శిక్షిస్తం: ఎస్పీ సింధు శర్మ

కామారెడ్డి: యూకేజీ స్టూడెంట్‎తో  పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిపై బీఎంఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించామని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితుడు నాగరాజుకి కఠినంగా శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న జీవదాన్​పాఠశాల వద్ద జరిగిన గొడవలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులపైనా కేసులు పెడతామన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు అని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు అని సూచించారు.

ALSO READ | కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత