మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులకు శిక్ష

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులకు శిక్ష

గోదావరిఖని, వెలుగు: మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్‌ లేనివారికి వెహికల్స్‌ ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని గోదావరిఖని వన్​ టౌన్​ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి హాలీడేస్‌ నేపథ్యంలో మైనర్లు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతారని, వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనర్లు, హెల్మెట్​ లేకుండా వెహికిల్స్​ నడపడం, ర్యాష్​ డ్రైవింగ్​, రాంగ్​రూట్​, త్రిబుల్​ రైడింగ్​, సెల్​ఫోన్​ డ్రైవింగ్‌ అంశాలపై 15 రోజుల పాటు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నట్టు సీఐ తెలిపారు.