![భగవంత్ మాన్ ని తాగుబోతు అన్న సీఎం చన్నీ](https://static.v6velugu.com/uploads/2022/02/Punjab-Aam-Aadmi-Party-CM-candidate-Bhagwant-Mann-made-sensational-remarks-by-CM-Charan-Jit-Singh-Channy_FseAIN8K4b.jpg)
పంజాబ్ లో ప్రచారం పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్, ఆప్ పార్టీలకు చెందిన నేతలు విమర్శలు..ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ పై సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ తాగుబోతు, నిరక్ష్యరాసుడు అని బఠిండాలోని ప్రచార కార్యక్రమాల్లో విమర్శించారు. మూడేళ్లలో 12వ తరగతి పాసయ్యాడన్నారు. అలాంటి వ్యక్తికి పంజాబ్ అధికార పీఠాన్ని ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు.
మరిన్ని వార్తల కోసం