పంజాబ్‌‌‌‌ అండ్‌‌‌‌ సింద్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో ఆఫీసర్​ జాబ్స్​

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌‌‌‌ అండ్‌‌‌‌ సింద్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ 183 స్పెషలిష్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: ఐటీ ఆఫీసర్‌‌‌‌, లా మేనేజర్‌‌‌‌, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్‌‌‌‌ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, ఫారెక్స్‌‌‌‌ డీలర్‌‌‌‌, ట్రెజరీ డీలర్‌‌‌‌, ఎకనమిస్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, టెక్నికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డెవలపర్‌‌‌‌.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌‌‌‌ డిగ్రీ, బీటెక్, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​: రాతపరీక్ష, షార్ట్‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వివరాలకు www.punjabandsindbank.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.