పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రూ.2 వేల కోట్ల సేకరణ

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రూ.2 వేల కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ (క్యూఐపీ) మార్గంలో రూ.2 వేల కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడానికి ఈ డబ్బులు వాడనుంది. ఫండ్స్ సేకరించేందుకు  బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని,    మర్చంట్ బ్యాంకర్లు త్వరలో జాయిన్ అవుతారని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ సీఈఓ స్వరూప్ కుమార్ అన్నారు.

మార్కెట్ పరిస్థితులు బట్టి ఫండ్ రైజింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండు లేదా మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసి రేషియో 17.10 శాతంగా ఉంది.  ఫండ్ రైజింగ్ సక్సెస్ అయితే బ్యాంక్ అడెక్వసి రేషియో మెరుగుపడుతుంది. మరోవైపు బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ వాటా తగ్గుతుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వానికి 98.25 శాతం వాటా ఉంది.