Punjab Bandh:డిసెంబర్ 30న పంజాబ్ బంద్..ఆందోళన చేస్తున్న రైతు సంఘాల పిలుపు

Punjab Bandh:డిసెంబర్ 30న పంజాబ్ బంద్..ఆందోళన చేస్తున్న రైతు సంఘాల పిలుపు

డిసెంబర్ 30 న పంజాబ్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.  గత కొంతకాలం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. డిసెంబర్ 30న పంజాబ్ లో బంద్ కు పిలుపునివ్వడం ద్వారా ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.

పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సర్వన్సింగ్ పంథేర్ మాట్లాడుతూ... డిసెంబర్ 30న ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు బంద్ పాటించాలని కోరారు. పంజాబ్ బంద్ కు అన్ని రైతు సంఘాలు, గ్రూప్ లు మద్దతునిచ్చాయని తెలిపారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూసివేయబడతాయని తెలిపారు. మరోవైపు రైళ్ల రాకపోకలు, రాష్ట్రంలోని అన్ని రహదారులు , రవాణా మార్గాలను నిర్భంధిస్తామని చెప్పారు.