భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

బెంగళూరు: ఐపీఎల్ వేలం షురూ అయ్యింది. స్టార్ ప్లేయర్లను దక్కించుకోవడానకి ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో టీమిండియా ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్, సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ భారీ ధరకు అమ్ముడుపోయారు. భారత ఓపెనర్ శిఖర్ ధవన్ ను రూ.8.25 కోట్లకు, రబాడను రూ.9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కమిన్స్ ను రూ.7.25 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్.. బౌల్ట్ ను రూ.8 కోట్లు, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, సీనియర్ పేసర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్నాయి. సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ను రూ.7 కోట్లకు బెంగళూరు చాలెంజర్స్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నాయి. ప్రొటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ను రూ.6.75 కోట్లు పెట్టి లక్నో టీమ్ దక్కించుకుంది. డాషింగ్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ ను రూ.12.25 కోట్లకు కోల్ కతా టీమ్ కొనుక్కుంది. ఇప్పటివరకు జరిగిన ఈ సీజన్ వేలంలో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం.  

మరిన్ని వార్తల కోసం:

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స్టార్ హీరో

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం