రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ

రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ

చండీఘడ్: ఊహించిందే జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ చన్నీని కాంగ్రెస్ రెండు స్థానాల నుంచి బరిలో దింపింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 8 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. అందులో చరణ్జీత్ చన్నీ బదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. పార్టీ ఫస్ట్ లిస్టులో చన్నీ చమ్కౌర్ సాహిబ్ స్థానం నుంచి బరిలో దిగుతారని చెప్పింది. ప్రస్తుతం ఆయన చమ్‌కౌర్ సాహిబ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న విభేధాల నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ పదవి నుంచి తప్పించింది. చరణ్ జీత్ చన్నీని ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే చన్నీ సోదరుడు సైతం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

టెకీలకు అమెరికా గుడ్ న్యూస్