రేపు పంజాబ్లో హాలిడే

రేపు పంజాబ్ వ్యాప్తంగా హాలిడే ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ షహీద్ దివస్ సందర్భంగా మార్చి 23న పబ్లిక్ హాలిడే ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీలో షహీద్ భగత్ సింగ్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించాలని తీర్మానాన్ని మాన్ సర్కార్ ఆమోదించింది. భారతదేశం మార్చి 23న షహీద్ దివస్ జరుపుకుంటుంది. అయితే ఆరోజే జరుపుకోవడానికి కారణం లేకపోలేదు. 1947న భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి తిరిగి స్వాతంత్ర్యం లభించింది. అయితే మనకు స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదు. అనేకమంది ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చింది. అలా దేశం కోసం బలిదానాలు చేసిన వీరులకు నివాళులర్పించేందుకు భారతదేశం షహీద్ దివస్‌ను జరుపుకుంటుంది. 

షహీద్ దివస్ మార్చి 23న నిర్వహించడానికి ఓ కారణం ఉంది. మార్చి 23న, ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు- భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు,సుఖ్‌దేవ్ థాపర్ బ్రిటిష్ వారు ఉరితీశారు. ఈ ముగ్గురు వీరులు ప్రజల సంక్షేమం కోసం పోరాడారు. అదే లక్ష్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. చాలా మంది యువ భారతీయులకు, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్ఫూర్తిదాయకంగా మారారు. బ్రిటీష్ పాలనలో కూడా, వారి త్యాగం చాలా మందిని దేశ స్వేచ్ఛా స్వాంతత్య్రాల కోసం ముందుకు వచ్చేలా ప్రేరేపించింది. అందువల్ల, ఈ ముగ్గురు విప్లవకారులకు నివాళులర్పించే క్రమంలో, భారతదేశం మార్చి 23ని షహీద్ దివస్‌గా జరుపుకుంది.