కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఎం

కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఎం

జలంధర్: పంజాబ్ సీఎం భగవంత్ మన్ కు కొద్దిలో ప్రమాదం తప్పింది.  జలంధర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో భగవంత్ మాన్ ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. అయితే బోట్ డ్రైవర్ అప్రమత్తతతో సీఎం కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి తృటిలోొ తప్పించుకున్నారు. పడవలో సీఎంతో పాటు రాజ్యసభ సభ్యుడు సంత్ బల్వీర్ సింగ్ కూడా ఉన్నారు. భారీ వరద ప్రవాహంలోకి వెళ్లడం, ఎక్కువ మంది పడవలో ప్రయాణించడమే  ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ALSO READ :తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు పెంచనున్న  చైనా.. 

ఈ వీడియోలో ఓవర్ లోడ్ తో పడవ ప్రయాణిస్తూ.. కొద్ది సేపటికే వెనకభాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు రావడం, పడవ అదుపు తప్పి దాదాపు నీటిలో  మునిగినట్లుగా కనిపిస్తుంది.మోటార్ బోట్ ఓవర్ లోడ్ లో వరద ప్రవాహానికి ఎదురుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బోట్ లో ప్రయాణిస్తున్న సీఎంతో సహా అందరూ అయోమయానికి గురయ్యారు. అదృష్టవశాత్తు బోట్ నీటిమీద తేలుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.  బోట్ డ్రైవర్ అప్రమత్తతతో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టు అధికారులు తెలిపారు.