![ఇవాళ హైదరాబాద్ రానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్](https://static.v6velugu.com/uploads/2022/12/Punjab-CM-Bhagwant-Mann_AxEmDwvand.jpg)
హైదరాబాద్, వెలుగు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం హైదరాబాద్కు వస్తున్నారు. తాజ్ కృష్ణాలో జరగనున్న ఒక ఇన్వెస్ట్మెంట్ మీటింగులో ఆయన పాల్గొననున్నారు. అయితే, లంచ్ టైంలో ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాల పరిస్థితులు, దేశ రాజకీయాలపై ప్రగతిభవన్లో చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో చర్చించాల్సిన విషయాలను ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలున్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం.