షహీద్ దివస్.. నివాళులర్పించిన పంజాబ్ సీఎం

షహీద్ దివస్.. నివాళులర్పించిన పంజాబ్ సీఎం

భగంత్ సింగ్‌కు నివాళులర్పించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.  షహీద్ దివస్ సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో భగత్ సింగ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజలు  ఫిర్యాదులు చేయవచ్చన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. షహీద్ దివస్ సందర్భంగా ఇవాళ పంజాబ్ వ్యాప్తంగా హాలిడే ప్రకటించింది.
మార్చి 23న పబ్లిక్ హాలిడే ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీలో షహీద్ భగత్ సింగ్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించాలని తీర్మానాన్ని మాన్ సర్కార్ ఆమోదించింది. 

భారతదేశం మార్చి 23న షహీద్ దివస్ జరుపుకుంటుంది. మార్చి 23న, ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు- భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు,సుఖ్‌దేవ్ థాపర్ బ్రిటిష్ వారు ఉరితీశారు. ఈ ముగ్గురు వీరులు ప్రజల సంక్షేమం కోసం పోరాడారు. అదే లక్ష్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ ముగ్గురు విప్లవకారులకు నివాళులర్పించే క్రమంలో, భారతదేశం మార్చి 23ని షహీద్ దివస్‌గా జరుపుకుంది.