నేను జనంలో ఒకడిని.. 1000 మందితో సెక్యూరిటీ అవసరం లేదు

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన సెక్యూరిటీ తగ్గించుకున్నారు. తాను జనంలో ఒకడినని... తనకు వెయ్యి మందితో భద్రత అవసరంలేదని చరణ్ జిత్ సింగ్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో భద్రత కారణంగా ప్రభుత్వ సొమ్ము అనవసరంగా ఖర్చు అవుతుందన్నారు. కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని అధికారులను ఆదేశించారు. తనకు లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆసక్తి లేదన్నారు. కపుర్తలాలో BR అంబేడ్కర్ మ్యూజియం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన చరణ్ జిత్ సింగ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా... స్థానిక కళాకారులతో కలసి పంజాబీ సంప్రదాయ భాంగ్రా డ్యాన్స్ చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

బుల్ రంకెలు..ఫస్ట్ టైం 60 వేలు దాటిన సెన్సెక్స్

వ్యవసాయం చేస్తమని కొని.. వెంచర్లు వేస్తున్నరు