న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. స్టమక్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, పోయిన ఆదివారం కాళీ బెన్ నది ప్రక్షాళన 22వ వార్షికోత్సవం సందర్భంగా పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధిలో ఆయన పర్యటించారు. అపుడు కాళీ బెన్ నది నుంచి ఓ గ్లాసెడు నీళ్లు తీసుకొని తాగారు. నది పక్కన ఉన్న పట్టణాలు, గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో వచ్చే మురుగు వ్యర్థాలతో కలుషితమైన కాళీ బెన్ నది నీళ్లను భగవంత్ మాన్ తాగడం వల్లే అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని ఆప్ పంజాబ్ నేతలు కొట్టి పారేశారు. నదిలో వాటర్ తాగడం వల్ల ఆయన ఆస్పత్రి పాలవ్వలేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. ‘‘గురునాక్ సాహిబ్ పాదాలు తాకిన భూమి సుల్తాన్‌పూర్ లోధి వద్ద కాళీ బెన్ నది పవిత్ర జలాన్ని సీఎం భగవంత్ మాన్ తాగారు.