బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

చండీఘడ్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన రోజునే ఓ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ హర్ జోత్ కమల్ కాంగ్రెస్ను వీడారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కు కేటాయించింది. అధిష్టానం నిర్ణయంతో మనస్తాపం చెందిన హర్ జోత్ కమల్ పార్టీ నుంచి వైదొలిగారు. 

కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యే హర్జోత్ కమల్ ఆ వెంటనే బీజేపీలో చేరారు. చండీఘడ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే హర్ జోత్ కమల్కు కమలం పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు.

మరిన్ని వార్తల కోసం..

గోరఖ్ పూర్ నుంచి పోటీపై సీఎం యోగి రియాక్షన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక నిర్ణయం