మటన్ కర్రీ ఆర్డర్ చేస్తే.. ఎలుక మాంసం పెట్టాడు..

పంజాబ్ లోని లూథియానాలో  రెస్టారెంట్ లో మలై చికెన్ ఆర్డర్ ఇస్తే .. ఎలుక మాంసం పెట్టారు.  అదేమని అడిగితే మీరు మాహోటల్ పరువు తీసేందుకు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారా  విశ్వకర్మ చౌక్‌కు సమీపంలోని ఓ రెస్టారెంట్ యజమాని  కస్టమర్లకు షాక్ ఇచ్చారు.

వీకెండ్ పార్టీస్, బర్త్ డే పార్టీలు, వెడ్డింగ్ డే పార్టీలు ఇలా ఉన్నప్పుడు సరదాగా పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు హోటళ్లకు, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళుతుంటాం. అక్కడున్న మెనూ జాబితా చూసి మనకిష్టమైన దాన్ని ఆర్డర్ ఇస్తాం.  తరువాత డబ్బు చెల్లించి బయటకు వస్తాం.  సాధారణంగా హోటళ్లలో కిచెన్ ప్రాంతాన్ని చూస్తే మనము తినలేము కదా.. ఎందుకొచ్చాంరా బాబూ అనిపిస్తోంది.  అయినా తప్పదు కదా కంప్యూటర్ యుగంలో.. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా..     అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. . .

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఓ రెస్టారెంట్ కు ఓ కుటుంబం వెళ్లింది.  అక్కడున్న మెనూ లిస్ట్ చూసి మలై మటన్ కు ఆర్డరిచ్చారు.  సర్వర్లు తీసుకొచ్చి వారు కూర్చున్న టేబుల్ దగ్గర ఆ పదార్దాన్ని ఉంచారు.  దానిని తినేందుకు స్పూన్స్ కూడా ఇచ్చారు.  ఆ స్పూన్ తో అటు ఇటు కదిపగా ఒక్క  సారిగా షాక్ కు గురయ్యారు. మలైమటన్ లో ఎలుక మాసం వచ్చింది.  అయితే అది కట్ చేయకుండా ఎలుక మాదిరిగా ఉండటంతో దానిని గుర్తించి..రెస్టారెంట్ యజమానులకు ఈ విషయంపై ఫిర్యాదుచేశారు. కాని రెస్టారెంట్ యజమాని కస్టమర్లవాదనతో ఏకీభవించకుండా కొంతమంది తమహోటల్ పరువుతీసేందుకుఇలాంటి ట్రిక్ లను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆ కస్టమర్లు మలై చికెన్ చనిపోయిన ఎలుక ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మలై చికెన్ కనిపించిన ఎలుక ముక్కలు కాకుండా అలాగే ఉండటంతో కస్టమర్లు గుర్తించగలిగారు.  అదే ముక్కలయి ఉంటే మాత్రం దానిని గుర్తించలేకపోయేవారు.  ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్లు ఎన్ని ఉన్నయో మరి.. ఇకనైనా హోటళ్లకు వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. . .

https://twitter.com/Gagan4344/status/1675824915235356673