
- పంజాబ్, హర్యానా హైకోర్టు
చండీగఢ్:భర్తను హిజ్రా (నపుంసకుడు) అని అనడం మానసిక క్రూరత్వమేనని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. నపుంసకుడిని కన్నది అంటూ అత్తను వేధించడం కూడా క్రూరత్వమే అవుతుందని చెప్పింది. తన భర్తకు అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.
కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భార్య పెట్టిన గృహ హింస కేసును కొట్టివేసింది. ఆమె గృహ హింసకు గురికాలేదని తీర్పు చెప్పింది. ఆ జంట మధ్య పెండ్లి అనేది డెడ్వుడ్గా మారిందని, తిరిగి అతికించలేమని హైకోర్టు పేర్కొంది.