
ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లోనూ ప్రభావం చూపలేకపోయాడు. తనపై ఎంతో నమ్మకముంచి మెగా ఆక్షన్ లక్నో రూ.27 కోట్ల రూపాయలకు పంత్ ను దక్కించుకుంది. అయితే పంత్ మాత్రం బ్యాటింగ్ తో కెప్టెన్ గాను విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్ ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ కాగా.. ఆ తర్వాత వరుసగా 17, 2 పరుగులు చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 1) పంజాబ్ సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔట్ కావడంతో అతనిపై ట్రోల్స్ వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
ఆక్షన్ జరిగే సమయంలో నాకు ఒకే ఒక టెన్షన్ ఉందని.. పంజాబ్ కింగ్స్ తనను కొంటుందని భయపడ్డానని పంత్ చెప్పుకొచ్చాడు. అయితే పంత్ ఈ మాటలను సరదాగా అన్నట్టు అర్ధమవుతుంది. నిజానికి మెగా ఆక్షన్ ముందు అందరికంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ వద్దే ఎక్కువ డబ్బు ఉంది. పంత్ కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించడానికి సిద్ధమైంది. అయితే పట్టు వదలకుండా లక్నో ఫ్రాంచైజీ పంత్ ను రూ. 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ప్లేయర్ కు ఇది అత్యధిక శాలరీ కావడం విశేషం.
ALSO READ | Yashasvi Jaiswal: సంచలన నిర్ణయం: ముంబైకి గుడ్ బై.. గోవా తరపున ఆడనున్న జైశ్వాల్
పంత్ సరదాగా అన్న మాటలను నెటిజన్స్ సీరియస్ గా తీసుకున్నారు. అతని ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ అని కామెంట్ చేస్తున్నారు. ఇక కొంతమంది పంజాబ్ జట్టును తక్కువగా అంచనా వేసి ఆ జట్టు చేతిలోనే ఘోరంగా ఓడిపోయారు అని చెప్పుకొచ్చాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమైన పంత్ మీద పెద్దగా విమర్శలు రాలేదు. కానీ పంజాబ్ మీద అతని పేలవ ప్రదర్శన అతన్ని ట్రోలింగ్ కు గురి చేశాయి. ప్రస్తుతం పంత్ సారధ్యంలోని లక్నో సూపర్ జయింట్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి రెండు ఓడిపోయింది.
Punjab Kings take a cheeky dig at Rishabh Pant after huge win over LSG 👀#LSGvPBKS #RishabhPant #IPL2025 pic.twitter.com/U6eruNKNuR
— Sportskeeda (@Sportskeeda) April 2, 2025
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్–18లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఛేజింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్), నేహల్ వాధెర (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) దంచికొట్టడంతో మంగళవారం (April 1) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన లక్నో 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి గెలిచింది.