PBKS vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు!

PBKS vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు!

ఐపీఎల్ లో మంగళవారం (ఏప్రిల్ 8) మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తో తలబడనుంది. చండీఘర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీలో చెన్నై ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ లో గెలిచింది. మరోవైపు పంజాబ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచి ఒకటి ఓడింది. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో న్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన