KKR vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. విండీస్ పవర్ హిట్టర్‌ను దింపిన కేకేఆర్

KKR vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. విండీస్ పవర్ హిట్టర్‌ను దింపిన కేకేఆర్

ఐపీఎల్ లో శనివారం (ఏప్రిల్ 26) కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేకేఆర్ కు నేడు జరగనున్న మ్యాచ్ లో గెలుపు అత్యంత కీలకం. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ఒకడుగు ముందుకేయాలని భావిస్తుంది. కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు గెలవగా.. పంజాబ్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించింది.  

ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పంజాబ్ జట్టులో మ్యాక్స్ వెల్, అజమాతుల్లా ఓమర్జాయ్ వచ్చారు. మరోవైపు కేకేఆర్ జట్టులో మొయిన్ అలీ, రమణ్ దీప్ స్థానంలో సకారియా, పోవెల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.   

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి