SRH vs PBKS: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. పంజాబ్ బ్యాటింగ్

SRH vs PBKS: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. పంజాబ్ బ్యాటింగ్

ఉప్పల్ వేదికగా శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ప్లే ఆఫ్ ఆశలు  సజీవంగా ఉంచుకోవాలంటే అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్  ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచింది    

సన్ రైజర్స్ మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. కాబట్టి ఇవాళ పంజాబ్ పై తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు సన్ రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. కామిందు మెండీస్ స్థానంలో మలింగ జట్టులోకి వచ్చాడు.     

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ