
ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 23) పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. చండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 15 నెలల తర్వాత క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. సొంతగడ్డపై ఆడుతుండడం పంజాబ్ కు కలిసి రానుంది. మరోవైపు ఢిల్లీ వార్నర్, మార్ష్ , నోకియా, పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు బోణీ చేస్తారో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్
Punjab Kings vs Delhi Capitals,2nd Match
— 🏏CricketFeed (@CricketFeedIN) March 23, 2024
🚨TOSS UPDATE🚨
Punjab Kings Won the toss and choose to Bowl first#PBKSvsDC #Match2 #MATCHDAY #RishabhPant pic.twitter.com/OOxx9w4Usi