
లక్నో వేదికగా లక్నో సూపర్ జయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభయ్యింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో లక్నో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది. తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఓడిపోయినా.. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో తిరిగి గాడిలో పడింది. మరోవైపు పంజాబ్ ఆడిన ఒకే మ్యాచ్ లో విజయం సాధిచింది. ఏ జట్టు గెలిచినా ఇది రెండో విజయం అవుతుంది. పంజాబ్ జట్టులోకి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు. లక్నో ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేయలేదు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
ALSO READ : బిగ్ బాష్ లీగులో కోహ్లీ.. విరాట్ ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన సిడ్ని సిక్సర్స్