SRH vs PBKS: ఉప్పల్‌లో పంజాబ్ వీర ఉతుకుడు.. ఘోరంగా విఫలమైన సన్ రైజర్స్ బౌలర్లు

SRH vs PBKS: ఉప్పల్‌లో పంజాబ్ వీర ఉతుకుడు.. ఘోరంగా విఫలమైన సన్ రైజర్స్ బౌలర్లు

ఉప్పల్ వేదికగా శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో ఘోరంగా విఫలమైంది. బౌలింగ్ లో అందరూ సమిష్టిగా విఫలమయ్యారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఉప్పల్ లో పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ఆరంభానికి తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 32 బంతుల్లో 86:6 ఫోర్లు,6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీసుకున్నారు.     

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. షమీ బౌలింగ్ లో ప్రియాంశ ఆర్య హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. మరో ఎండ్ లో ప్రబు సిమ్రాన్ సింగ్ రెచ్చిపోవడంతో తొలి మూడు ఓవర్లలోనే వికెట్ పడకుండా 53 పరుగులు చేసింది. ప్రియాంశ ఆర్య  13 పరుగులకే 36 పరుగులు చేసి నాలుగో ఓవర్ లో ఔటయ్యాడు. ఇదే ఊపులో పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత ప్రబు సిమ్రాన్ సింగ్ (42) భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు మలింగాకే దక్కాయి. 

►ALSO READ | LSG vs GT: మార్కరం ధనాధన్.. పూరన్ ఫటా ఫట్: భారీ స్కోర్ చేసి లక్నో చేతిలో ఓడిన గుజరాత్

ఈ దశలో నేహాల్ వధేరా కలిసి అయ్యర్ మెరుపులు మెరిపించాడు. స్కోర్ వేగం ఎక్కడా తగ్గకుండా వధేరాతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్వల్ప వ్యవధిలో వధేరా(27), శశాంక్ సింగ్(2), మ్యాక్స్ వెల్ (3) ఔటైనా అయ్యర్ మాత్రం బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న పంజాబ్ కెప్టెన్.. ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. 17 ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన శ్రేయాస్.. 18 ఓవర్లో 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయ్యర్ ఔటయ్యే సరికి సన్ రైజర్స్ స్కోర్ 200 పరుగుల మార్క్ దాటింది. షమీ చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ (11 బంతుల్లో 34: 4 సిక్సర్లు, ఒక ఫోర్) నాలుగు సిక్సర్లతో చెలరేగడంతో 245 పరుగుల మార్క్ చేరుకుంది.