KKR vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్!

KKR vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 69:8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (49 బంతుల్లో 83:6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. 83 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆర్య, సిమ్రాన్ సింగ్  పవర్ ప్లే లో దూకుడుగా ఆడడంతో 56 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత మరింత విజృంభించిన వీరిద్దరూ స్కోర్ కార్డును సెర వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సునీల్ నరైన్ బౌలింగ్ లో వీరిద్దరూ కలిసి మూడు సిక్సర్లు బాదడంతో పంజాబ్ తిరుగుల్ని ఆధిక్యంలో నిలిపింది. తొలి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ప్రియాంష్ ఆర్య భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ తో కేకేఆర్ కు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లోనే 83 పరుగులు చేసి పంజాబ్ ను పటిష్ట స్థితికి చేర్చాడు. సిమ్రాన్ సింగ్  ఔటైన తర్వాత పంజాబ్ స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. కేకేఆర్ బౌలర్లు పుంజుకోవడంతో చివరి 5 ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాక్స్ వెల్ (7) మరోసారి విఫలం కాగా.. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ శ్రేయాస్ అయ్యర్ (25) దూకుడుగా ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ 201 పరుగులకే పరిమితమైంది.