
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. పవర్ ప్లే లో విఫలమైనా.. ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి పంజాబ్ ను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. మరోవైపు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిరాశపరించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో సాయుశ్ శర్మ, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. రొమారియో షెపర్డ్ కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. 22 పరుగులు చేసిన ప్రియాంష్ ఆర్యను ఔట్ చేసి ఆర్సీబికి పాండ్య తొలి బ్రేక్ ఇచ్చాడు. సిమ్రాన్ సింగ్ హిట్టింగ్ తో పవర్ ప్లే లో వికెట్ నష్టానికి పంజాబ్ 62 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. పవర్ ప్లే తర్వాత పంజాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (33), శ్రేయాస్ అయ్యర్ (6) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.
ఆ వెంటనే నేహాల్ వధేరా (5) రనౌట్ రూపంలో వెనుదిరగడంతో పంజాబ్ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జోష్ ఇంగ్లిష్ (31), శశాంక్ సింగ్ (1) జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 36 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ దశలో మరోసారి వెంటనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. మంచి టచ్ లో ఉన్నాడనుకున్న ఇంగ్లిస్ తో పాటు మార్కస్ స్టోయినిస్ ఒక పరుగే చేసి పెవిలియన్ కు చేరాడు. చివర్లో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ 157 పరుగులకే పరిమితమైంది.
RCB’s spinners take charge and keep PBKS to 157 👊
— ESPNcricinfo (@ESPNcricinfo) April 20, 2025
Follow live 👉 https://t.co/fuXRtx0vB9 | #PBKSvRCB #IPL2025 pic.twitter.com/K615mYr5YO