ఇద్దరినే రిటైన్ చేసుకున్న పంజాబ్.. రూ.110 కోట్లతో ఆక్షన్‎లోకి ఎంట్రీ

ఇద్దరినే రిటైన్ చేసుకున్న పంజాబ్.. రూ.110 కోట్లతో ఆక్షన్‎లోకి ఎంట్రీ

2025 ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అఫిషియల్‎గా పంజాబ్ కింగ్స్ ప్రకటించింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లనే పంజాబ్ రిటైన్ చేసుకుంది. యంగ్ బ్యాటర్స్ ప్రభుమాన్ సింగ్, శశాంక్ సింగ్‎లను మాత్రమే వచ్చే సీజన్ కోసం జట్టుతో అట్టిపెట్టుకుని మిగిలిన అందరిని వేలానికి వదిలేసింది. ఆన్ క్యాప్డ్ ప్లేయర్స్ ప్రభుమాన్ సింగ్‎కు రూ.4 కోట్లు, శశాంక్ సింగ్‎కు రూ.5.4 కోట్లు చెల్లించి పంజాబ్ రిటైన్ చేసుకుంది. లాస్ట్ సీజన్‎లో అద్భుతంగా రాణించడంతో వీరిద్దరిపై మరోసారి నమ్మకంతో పంజాబ్ జట్టుతో అట్టిపెట్టుకుంది. 

ఈ ఇద్దరి కోసం రూ.9.5 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రూ.110.5 కోట్లతో పంజాబ్ మెగా వేలంలో పాల్గొననుంది. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రాన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ వదిలేసుకుంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 16 సీజన్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ఫర్మామెన్స్ మినహా ఇస్తే... ప్రతి సీజన్‎లోనూ చెత్త ప్రదర్శనతో టైటిల్ గెలవకుండానే పంజాబ్ కింగ్స్ వెనదిరిగింది.

ALSO READ | IPL Retention 2025: రాజస్థాన్ రిటైన్ లిస్ట్ రిలీజ్: బట్లర్‌కు బిగ్ షాక్.. శాంసన్, జైస్వాల్‌కు రూ.18 కోట్లు

దీంతో వచ్చే సీజన్‎లో ఎలాగైనా టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పంజాబ్ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే టీమ్‎లోని స్టార్ ప్లేయర్లందరిని వదిలేసి.. ఫ్రెష్‎గా వేలానికి వెళ్లనుంది. ఇందుకోసమే పర్స్‎లో ఏకంగా  రూ.110.5 కోట్లు ఉంచుకుంది. మెగా వేలానికి వెళ్లే అన్ని జట్ల కంటే పంజాబ్ కింగ్స్ పర్స్ లోనే అత్యధికంగా ఫండ్స్ ఉన్నాయి.

="utf-8">