IPL 2024: కొత్త స్టేడియంలో పంజాబ్ కింగ్స్ హోమ్ మ్యాచ్ లు

IPL 2024: కొత్త స్టేడియంలో పంజాబ్ కింగ్స్ హోమ్ మ్యాచ్ లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 సీజన్ కోసం తమ హోమ్ మ్యాచ్‌లు లో ఆడే విషయంలో కీలక మార్పులు చేసింది. పిసిఎ ఐఎస్ బింద్రా స్టేడియంకు బదులుగా మొహాలీలోని ముల్లన్‌పూర్‌లోని కొత్తగా అభివృద్ధి చేసిన మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో ఆడనున్నట్లు పంజాబ్ కింగ్స్ సోమవారం ప్రకటించింది. యదవీంద్ర సింగ్ స్టేడియం గత రెండు సంవత్సరాలుగా దేశీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న ఇస్తుంది. 

ఇక్కడ ఆధునిక సౌకర్యాలు, అగ్రశ్రేణి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. అంతేకాదు ఈ స్టేడియం సీటింగ్ సామర్ధ్యం 33,000. ముల్లన్‌పూర్ స్టేడియంలో హెరింగ్‌బోన్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది. ఇది వర్షం ఆగిన 25-30 నిమిషాలలో నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ మట్టిని ఉపయోగించకుండా, నేల ఇసుకతో తయారు చేయబడింది. ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలబడుతుంది.  

ALSO READ :- ఇన్స్ట్రాగ్రామ్ స్టార్ అనామికా బిష్ణోయ్ను కాల్చి చంపిన భర్త

ఐపీఎల్ లో పంజాబ్ నిలకడగా రాణించింది లేదు. 2014 లో ఫైనల్.. 2008 సీజన్ లో సెమీస్ మినహాయిస్తే మిగిలిన సీజన్ లలో ఇంటి ముఖం పట్టింది. పప్రస్తుతం శిఖర్ ధావన్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2023 మినీ వేలంలో సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ రూ. 11.75 కోట్లకు అమ్ముడుపోయి అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రిలీ రోసోవ్ రూ 8.00 కోట్లు, క్రిస్ వోక్స్ రూ 4.00 లాంటి విదేశీ ప్లేయర్లతో పంజాబ్ బలంగా కనబడుతుంది.