PBKS vs DC: కరణ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం

PBKS vs DC: కరణ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ అర్ధ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 63 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని దూరం చేశాడు. కరణ్ కు సహచర ప్లేయర్ లివింగ్ స్టోన్ చక్కని సహకారం అందించాడు. చివర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిన దశలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

కెప్టెన్ శిఖర్ ధావన్(22), సిమ్రాన్ సింగ్ (26) పర్వాలేదనిపించారు. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్, కరణ్ 67 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ ను పంజాబ్ వైపుకు తిప్పింది. ఇశాంత్ శర్మకు గాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయంపై ప్రభావం చూపించింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ చివర్లో (10 బంతుల్లో 32, 4ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగడంతో పంజాబ్ కు ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆసీస్ ఓపెనర్లు మార్ష్ (20), వార్నర్(29) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. 15 నెలలు తర్వాత క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్ 18 పరుగులు చేసి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రబడా, హరిప్రీత్ బ్రార్,రాహుల్ చాహర్ కు తలో వికెట్ దక్కింది.