LSG vs PBKS: శివాలెత్తిన పంజాబ్ బ్యాటర్లు.. 172 టార్గెట్ 16.2 ఓవర్లలోనే ఫినిష్

LSG vs PBKS: శివాలెత్తిన పంజాబ్ బ్యాటర్లు.. 172 టార్గెట్ 16.2 ఓవర్లలోనే ఫినిష్

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతుంది. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (69) కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ అయ్యర్ (50), నెహ్యాల్ వధేరా (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.  మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి గెలిచింది. 

172 పరుగుల ఒక మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఓవర్లలోనే 12 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టింది. 8 పరుగులు చేసిన ప్రియాంశ ఆర్య.. భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ తో జత కలిసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ హిట్టింగ్ తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిమ్రాన్ సింగ్ ధాటికి పంజాబ్ పవరే ప్లే లోనే 62 పరుగులు జోడించింది. ఈ క్రమంలో 23 బంతుల్లోనే ఈ పంజాబ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. 

ALSO READ | LSG vs PBKS: రాణించిన పూరన్, బదోని.. పంజాబ్ ముందు డీసెంట్ టార్గెట్

మరో ఎండ్ లో శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ సిమ్రాన్ సింగ్ కు చక్కని సహకారం అందించాడు. 69 పరుగులు చేసి సింగ్ ఔటైనా శ్రేయాస్ అయ్యర్ (52) నెహ్యాల్ వధేరా (43) వేగంగా ఆడి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ కు 2 వికెట్లు దక్కాయి.   అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లందరూ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన పూరన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బదోని (32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. లాకీ ఫెర్గుసన్, మ్యాక్స్ వెల్, మార్కో జాన్సెన్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.