వాసాలమర్రిలో పంజాబ్ మంత్రి బల్జీత్ కౌర్ పర్యటన

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదాద్రి జిల్లాలో  పంజాబ్ మంత్రి బల్జీత్ కౌర్ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్ల బృందం శనివారం పర్యటించింది.  మొదటగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలో  పర్యటించారు.  దళితబంధు లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను గ్రౌండ్ లెవల్ లో తిరిగి పరిశీలించారు. వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.  దళితబంధు పథకం వల్ల రోజువారీ కూలీలమైన తాము ఓనర్లుగా మారామని వారు మంత్రికి వివరించారు.