అవినీతి ఆరోపణలపై పంజాబ్ మంత్రి అరెస్ట్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాపై వేటు వేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ఒకశాతం వాటా ఇవ్వాలని సింగ్లా డిమాండ్ చేసినట్లు బలమైన ఆధారాలు ఉండటంతో భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నుంచి తొలగించిన నిమిషాల వ్యవధిలోనే అవినీతి నిరోధక శాఖ విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశింది. మంత్రి విజ‌య్ సింఘాల్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌నను కేబినెట్ నుంచి తొల‌గించినట్లు భగవంత్ మాన్ ప్రకటించారు. ఆయ‌న‌పై కేసు నమోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించినట్లు చెప్పారు. త‌మ ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించ‌దని మాన్ స్పష్టం చేశారు. 

అవినీతి ఆరోపణలపై ఒక మంత్రిని కేబినెట్ నుంచి తొలగించి అరెస్ట్ చేయించడం దేశ చరిత్రలో రెండోసారి. 2015లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరుడిపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై వేటు వేశారు. తాజాగా భగవంత్ మాన్ నిర్ణయాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. ఈ నిర్ణయంతో జాతియావత్తూ ఆప్ను చూసి గర్వపడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఢిల్లీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడు రోజులు ఫ్రీ జర్నీ