బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ రంగ సంస్ధ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1025 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో ఆఫీసర్-క్రెడిట్ (JMG స్కేల్-I), మేనేజర్-ఫారెక్స్ (MMG స్కేల్-II), మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-II), సీనియర్ మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-III) తదితర పోస్టుల భర్తీ చేయనుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు జాబ్ ఎక్స్పిరియన్స్ ఉండాలి. జనవరి 1, 2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. అప్లికేషన్ ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. ఫిబ్రవరి 7 నుంచి 25 తేది వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అప్లై చేసుకోవడానకి చివరి గడువు.. ఫిబ్రవరి 25. అఫిషియల్ వెబ్ సైట్ pnbindia.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.