జైళు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్

జైళు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్

పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేషనల్ వైడ్ హాట్ టాపింక్ గా మారాడు. చిన్న వయసులోనే పెద్ద క్రిమినల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొని.. డెరెక్ట్ గా మీడియా ద్వారానే చంపుతా అని బెందిరించే స్థాయికి లారెన్స్ బిష్ణోయ్ చేరుకున్నాడు. అతనికి బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ ఖరార్ CIAలో ఉన్నప్పుడు 2022 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జైళు నుంచే ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్వవహరించిన ఏడుగురు పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. 

కస్టడీలో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన అతని ఇంటర్వ్యూపై విచారణ తర్వాత ఇద్దరు DSPలతో సహా ఏడుగురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. 2022 సెప్టెంబర్ 3-4 తేదీల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ఇంటర్వ్యూ సీక్రెట్ గా ఓ ఛానెల్‌లో టెలికాస్ట్ అయినట్లు SIT విచారణలో తేలింది. జైళు అధికారులు డీఎస్పీలు గుర్షేర్ సంధు, సమ్మర్ వనీత్ సహా ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జైళ్లో ఉన్న ఖైదీని ఇంటర్వ్యూకి ఎలా అనుమతించారో అని అధికారులను ప్రశ్నించింది. లారెన్స్ వీడియోలు తీసి, టెలికాస్ట్ ఎలా చేశారని దర్యాప్తులో తేలింది. 

 

Also Read : 19ఏళ్ల లేడీడాన్‌ ఏం చేసిందో చూస్తే