సస్తే చావు.. అంతేకానీ : 10 కిలోమీటర్లు ఇలాగే వెళ్లిన కారు..

సస్తే చావు.. అంతేకానీ : 10 కిలోమీటర్లు ఇలాగే వెళ్లిన కారు..

పంజాబ్‌లోని కపుర్తలాలోని సుల్తాన్‌పూర్ లోధి ప్రాంతంలో ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిపై.. ఓ ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని ఐఈఎల్‌టీఎస్‌ చదువుతున్న హర్మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. బల్జీందర్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తన కారును వేగంగా నడుపుతూ.. విద్యార్థిపై క్రూరంగా ప్రవర్తించాడు.

ఈ షాకింగ్ సంఘటన అక్టోబర్ 26 న రాష్ట్రంలోని సహ్లాపూర్ బెట్ గ్రామం సమీపంలో రోడ్డు పక్కన హర్మన్‌ప్రీత్ నిలబడి ఉన్నప్పుడు జరిగింది. వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను కారు బానెట్, పైకప్పుపై పడ్డాడు. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న ఉపాధ్యాయుడు ప్రమాదం తర్వాత కూడా వాహనాన్ని ఆపకుండా.. కారు ముందు భాగంలో వేలాడుతున్న వ్యక్తితో డ్రైవింగ్ ను కొనసాగించాడు. బల్జీందర్ విద్యార్థిని కనీసం కనికరం లేకుండా దాదాపు పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం.

గాయపడిన సింగ్‌ను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పాత కక్షల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఉపాధ్యాయుడిపై ఇప్పటికే నడుస్తున్న కొన్ని కేసులతో పాటు నేర ప్రవృత్తి కూడా ఉందని చెప్పారు. అయితే, అతడిని అరెస్టు చేయకపోవడానికి గల కారణాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు పోలీసులు చర్యలు ప్రారంభించి, వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.