ఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 8న ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఎన్నిక జరగాల్సి ఉంది. తాజాగా ఎన్నికల తేదీని మార్చిన ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్లో మార్పు చేసింది.
ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉంది. దానికి సంబంధించిన ఉత్సవాలు ముందుగానే ప్రారంభమవుతాయి. వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపు 20లక్షల మంది భక్తులు పంజాబ్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి వెళ్తారు. దీంతో వారంతా ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్ లో ఓటు వేసే అవకాశం కోల్పోతారని అన్ని పార్టీలు ఈసీకి తెలిపాయి. ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ సైతం పోలింగ్ ను వారం పాటు వాయిదా వేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీల అభ్యర్థన మేరకు పోలింగ్ వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..