
ధర్మశాల వేదికగా పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కోహ్లీ (42) పరుగులు, గ్రీన్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు రజత్ పటిదార్ 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సామ్ కరన్ వేసిన 9.6 ఓవర్‌కు వికెట్ కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో వర్షం కురవడం ప్రారంభమవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆటగాళ్లు మైదానాన్ని వీడగా.. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కాగా ప్లేఆఫ్స్ సజీవంగా ఉండాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది.