పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేయబోన్నారు. ఆయన చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఇవాళ మూడో లిస్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆయన భదౌర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనపై ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చరణ్‌జిత్ చన్నీ చంకౌర్ సాహిబ్ నియోజకవర్గంలో ఓడిపోతారని తాము ముందే చెప్పామని, దీనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నట్టయిందని ఆయన ట్వీట్ చేశారు.
मैंने कहा था कि हमारे सर्वे के मुताबिक़ चन्नी जी चमकौर साहिब से हार रहे हैं। आज कांग्रेस ने एलान किया है कि वो दो सीटों से चुनाव लड़ेंगे। इसका मतलब सर्वे सच है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 30, 2022
‘‘మా సర్వే ప్రకారం చన్నీ చంకౌర్ సాహిబ్ నియోజకవర్గంలో ఓడిపోబోతున్నారని నేను ఇప్పటికే చెప్పాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చన్నీ రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంటే దీనర్థం మా సర్వే నిజమనేనా?” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న ఒకే దశలో జరగబోతున్నాయి. ఓట్ల కౌంటింగ్ మార్చి 10న ఉంటుంది.