ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో హరీశ్​ను అదుపులోకి తీసుకుని విచారించాలి : పంజాగుట్ట పోలీసులు

  • హైకోర్టుకు పంజాగుట్ట పోలీసుల వెల్లడి
  • కౌంటర్  పిటిషన్ దాఖలు చేసిన ఏసీపీ
  • హరీశ్ క్వాష్  పిటిషన్​పై నేడు విచారణ

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆరోపణలు తీవ్రమైనవని, ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేసుకు సంబంధించి అందిన ఫిర్యాదు ప్రకారం హరీశ్ తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు పంజాగుట్ట ఏసీపీ మోహన్  కుమార్.. హైకోర్టులో కౌంటర్  పిటిషన్   దాఖలు చేశారు. ‘‘ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా హరీశ్  పలుకుబడి గల వ్యక్తి. సాక్షులను బెదిరించవచ్చు. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయగలరు” అని ఏసీపీ పేర్కొన్నారు. 

కాగా.. తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హరీశ్ రావు ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేయించారంటూ రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వ్యాపారి జి.చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను అరెస్టు చేయరాదని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దాఖలు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో పంజాగుట్ట ఏసీపీ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వేశారు. ఇప్పటికే చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ‘‘తనపై హరీశ్ రావు కక్ష పెంచుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కేసులుపెట్టించి వేధించారని పోలీసులకు  చక్రధర్ గౌడ్  వాంగ్మూలం ఇచ్చారు.

 రెండో నిందితుడైన రాధాకిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ద్వారా తనను నిర్బంధించి బెదిరించారని  పేర్కొన్నారు.  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సు కార్యాలయానికి తీసుకెళ్లి భౌతికదాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు’’ అని ఏసీపీ తన కౌంటర్  పిటిషన్ లో వెల్లడించారు. చక్రధర్  ఇచ్చిన ఫిర్యాదుపై సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గణేశ్, పి.శ్రావణ్, ఎం.సాయి, జి.చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్, వీరబాబు వంటి ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని తెలిపారు. చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేట పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు సిద్దిపేట ఏసీపీ పిలిచి సిద్దిపేటలో సేవా కార్యక్రమాలను చేయకూడదని హెచ్చరించారని వివరించారు.  కాగా.. హరీశ్ రావు వేసిన క్వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేయనుంది.