జమ్మికుంటలో బిర్యానీ పంచాయితీ.. తనిఖీలు చేసినఫుడ్ ఇన్‌‌స్పెక్టర్​

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట టౌన్‌‌లో రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో చికెన్ బిర్యానీ కొనుగోలుపై వివాదం నెలకొంది. శుక్రవారం ఐలవేణి కుమార్ అనే వ్యక్తి బిర్యానీ ఆర్డర్​ చేశాడు. దానిలో బోన్స్​ బ్రేక్ ​కావడం లేదని, అవి చికెన్​ బోన్స్​లా లేవంటూ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కుమార్‌‌‌‌ను స్టేషన్‌‌కు తరలించారు. ఫుడ్​ఇన్‌‌స్పెక్టర్​అనూషకు సమాచారం అందడంతో ఆమె బిర్యానీ సెంటర్​ను తనిఖీ చేశారు. 

షాపులోని బిర్యానీ, లెగ్ పీస్, ఆయిల్, ఇతర సామగ్రి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిపోర్ట్​వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడే ఉన్న యూత్​కాంగ్రెస్​లీడర్లు గతంలోనూ ఇదే విధంగా శాంపిల్స్ సేకరించి, కేవలం ఫైన్ల వదిలేసి వదిలేశారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.